సీఎం కేసీఆర్ ప్రహ్లాద స్వరూపుడై నవ యాదాద్రికి సంకల్పించగా, ఆ మహాయజ్ఞంలో భాగస్వాములై ఇల వైకుంఠాన్ని సాక్షాత్కరింపజేయడంలో ఎందరో నిపుణుల కృషి ఉంది. ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంలో చారిత్రక, ఆధ్యాత్మిక వైభవాన్ని కృష్ణ్ణశిలారూపంలో నిక్షిప్తం చేసి, వెయ్యేండ్లు వర్ధిల్లేలా ప్రధానాలయాన్ని పునర్నిర్మించారు. ఆ అసమాన ప్రతిభను, విశేష కృషిని గుర్తిస్తూ ఆలయ పునఃప్రారంభం సందర్భాన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి వారిని సన్మానించారు.