న్యూఢిల్లీ : బ్యాంకాక్‌లోని ఓ భవనం ఆరో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిన పిల్లి ప్రాణాలతో బయటపడిన ఉదంతం (Viral Post) వెలుగుచూసింది. పిల్లి పార్కింగ్ ఏరియాలోని కారుపై పడటంతో వాహనం వెనుక విండో అద్దాలు పగిలాయి. దెబ్బతిన్న కారు, పిల్లి ఫొటోలు అపివత్ తయతక అనే యూజర్ ఫేస్బుక్లో షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
కారులో పిల్లి ఉందని ఉదయం ఏడు గంలకు నిటి కాల్ చేయడంతో నేను కన్ఫ్యూజ్ అయ్యాను..ఇది కారుపై ఎందుకు పడింది..? 8.5 కిలోల బరువున్న పిల్లి ఆరో ఫ్లోర్ నుంచి పడటంతో కారు వెనుక డోర్ గ్లాస్ పగిలిందని చెప్పారని పోస్ట్‌కు క్యాప్షన్‌గా ఇచ్చారు.
పిల్లిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. యజమానితో కలిసి నడుస్తుండగా ప్రమాదవశాత్తూ పిల్లి కింద పడినట్టు తెలిసింది. ఇక ఈ ఘటనలో పిల్లి స్వల్ప గాయాలతో బయటపడింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరలవుతోంది.
Read More
Newly married woman | ఫోన్ చూడొద్దన్నందుకు భర్తను వదిలేసిన నవ వధువు