Newly married woman | నిరంతరం ఫోన్లో మునిగి తేలుతున్న నవ వధువును ఫోన్ చూడొద్దని అత్తామామలు మందలించారు. అత్తామామల ఆదేశంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవ వధువు తన భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లింది. ఈ ఘటన బీహార్‌లోని హాజీపూర్‌లో వెలుగు చూసింది.
ఇలియాస్ అనే వ్యక్తి సాబా ఖతూన్‌ను ఇటీవలే వివాహం చేసుకున్నాడు. అయితే సాబా ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్లో మునిగి తేలుతుంది. నిరంతరం ఫోన్‌తోనే గడుపుతున్న కోడలిని అత్తామామలు మందలించారు. భర్త కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో సాబా తన సోదరుడితో తల్లిదండ్రులకు ఫోన్ వివాదం గురించి తెలిపింది.
తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన సాబా సోదరుడు.. తన బావ ఇలియాస్‌ను తుపాకీతో భయపెట్టించాడు. ఈ విషయం పోలీసుల దాకా చేరింది. దీంతో ఇలియాస్ ఇంటికి చేరుకున్న పోలీసులు సాబా సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. తన బిడ్డ ఫోన్ లాక్కున్నారని, కనీసం తమతో ఫోన్లో మాట్లాడేందుకు కూడా ఆమె అత్తామామలు అనుమతించడం లేదని ఆమె తల్లి పోలీసులకు తెలిపింది. మొత్తంగా తన భర్త, అత్తామామల నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, తన పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి సాబా అత్తగారింటి నుంచి వెళ్లిపోయింది.