లింగాల : ఉడుములను వేటాడిన ( Hunting Skunks ) నలుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు ( Arrest ) చేశారు. మండలంలోని పద్మనపల్లి గ్రామానికి చెందిన కాట్రాజు రాజు ,కాట్రాజు నిరంజన్ ,రాయ బాలయ్య , బల్మూరి లింగస్వామి అనే వ్యక్తులు గురువారం సమీపంలో ఉన్న రమేష్ గుండాల ప్రాంతంలో ఉడుములను వేటడారు.
వాటిని తీసుకుని వస్తుండగా అటవీ సిబ్బందికి తారాస పడడంతో నలుగురు వ్యక్తులను తనిఖీ చేశారు. వారి వద్ద తొమ్మిది ఉడుములు దొరికినట్లు తెలిపారు . నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకొని వన్య ప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో జయదేవ్, సిబ్బంది పాల్గొన్నారు .
Also Read |
విజిలెన్స్‌కు చిక్కిన అవినీతి తిమింగలం.. చీఫ్ ఇంజినీర్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు స్వాధీనం.. VIDEO
బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ఐదుగురు మృతి, పలువురికి గాయాలు