హైదరాబాద్ : ధాన్యం కుంభకోణం కేసులో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు రేఖా నాయక్ ( Rekha Naik ) పై పోలీసులు కేసు నమోదు ( Case Registered) చేశారు. రేఖా నాయక్ కు చెందిన రైస్ మిల్లులో రూ.40.96 కోట్ల ప్రభుత్వ ధాన్యం మాయమైనట్టు విజిలెన్స్ దాడులో అధికారులు గుర్తించారు.
ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలో రేఖా నాయక్ పేరిట ఉన్న ఏఆర్ఎస్ రైస్ మిల్లులో మూడు రబీ సీజన్లకు సంబంధించిన 9,639.962 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు , మాయమైన ధాన్యం విలువ రూ.40.96 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా వేసి కేసు నమోదు చేశారు.
ప్రభుత్వానికి అప్పగించాల్సిన ధాన్యాన్ని లెక్కల్లో చూపకుండా మళ్లించా రని, ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేశారని అధికారుల నివేదికను రూపొందించారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఫిర్యాదుతో రేఖా నాయక్‌పై క్రైమ్ నంబర్ 165/2026 కింద ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.