Ala Bolelo | సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ చిత్రం ‘జైలర్ 2’ (Jailer 2). బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మేకర్స్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సినిమాలోని మొదటి పాట ‘అలా బోలెలో’ (Ala Bolelo) ను ఆగస్టు 21న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు సన్ పిక్చర్స్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు తాజాగా పాటకు సంబంధించిన ప్రోమో వీడియోను విడుదల చేసింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఈ పాటపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘టైగర్’ ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజినీకాంత్ మరోసారి పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో అలరించనున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు.
Ala Bolelo fever is about to begin in 2 days! 🤩🪘#Jailer2 First Single #AlaBolelo is releasing on Aug 21 🔥@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @shamna_kkasim @vijaykartikdop @Nirmalcuts @ChethanDsouza @AlwaysJani @KiranDrk #PallaviSingh @valentino_suren… pic.twitter.com/7nfjXHf0vM
— Sun Pictures (@sunpictures) August 19, 2026