హైదరాబాద్ : నగరంలోని పేట్ బషీరాబాద్ (Petbasheerabad ) పీఎస్ పరిధి పద్మనగర్ ఫేస్ 2 సాయిబాబా ఆలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్( Apartment ) నుంచి ప్రమాదవశాత్తు కిందపడి కార్మికుడు మృతి ( Worker Died ) చెందారు.
జనగామ జిల్లా కొడకండ్ల మండలం రంగాపురం గ్రామానికి చెందిన సిలివేరు కుమార్ (35) బ్రతుకుతెరువు కోసం భార్య, పిల్లలతో నగరానికి వచ్చి గాజులరామారంలో నివాసముంటు న్నాడు. బుధవారం బహుళ అంతస్తుల నిర్మాణంలో కింద నుంచి మెటీరియల్ తీసుకెళ్లే క్రేన్ మిషన్ ఆపరేటర్‌గా పని చేస్తుండగా ప్రమాదవశాత్తు మిషన్ బేరింగ్ లు ఊడిపోవడంతో మిషన్ పైన ఉన్న కుమార్ ఐదవ అంతస్తు నుంచి ఒక్కసారిగా కింద పడిపోవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.
మృతుడికి భార్య మమత, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. కాగా భవన యజమాని ఎలాంటి సేఫ్టీ ఏర్పాట్లు చేయకపోవడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.