పంత్‌కు జరిమానా
ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు జరిమానా పడింది. గురువారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌కు పాల్పడినందుకు ఐపీఎల్ పాలక మండలి.. పంత్‌కు రూ.12 లక్షల జరిమానా విధించింది. ‘ఈ సీజన్లో ఢిల్లీకి ఇదే తొలి తప్పిదం. నియమావళి ప్రకారం నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు కెప్టెన్ రిషబ్ పంత్‌కు రూ.12 లక్షలు జరిమానా విధించాం’ అని ఐపీఎల్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. లీగ్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లాడిన ఢిల్లీ ఒకదాంట్లో నెగ్గి రెండింట ఓడింది.