జడ్చర్లటౌన్, మార్చి 8 : మహిళలు అన్ని రం గాల్లో దూసుకెళ్లాలని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం జడ్చర్లలో రన్ ఫర్ హెల్త్ 2కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించా రు. మొదటగా జడ్చర్ల కొత్త బస్టాండ్ వద్ద మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి జెండా ఊపి 2కే రన్ ప్రారంభించారు. జడ్చర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి పట్టణ ప్రధాన రహదారుల మీదుగా మినిస్టేడియం మైదానం వరకు నిర్వహించిన 2కే రన్ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డితోపాటు మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత, వైస్‌చైర్‌పర్సన్ సారిక, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ దొరేపల్లి లక్ష్మి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ యాదయ్యతోపాటు మహిళా కౌన్సిలర్లు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, మహిళలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అనంతరం మినీ స్టేడియం మైదానంలో జరిగిన సమావేశం లో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడారు. మ హిళలు అనేక కష్టాలకు అధిగమించి ముందుకెళ్తున్నారని, అన్ని రంగాల్లోనూ మహిళలు దూసుకెళ్లాలని సూచించారు. మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు. ఏడాదికొకసారి తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాలని సూ చించారు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే ముం దుగా గుర్తిస్తే వ్యాధిని నయం చేసే అవకాశం ఉంటుందన్నారు. శ్వేత ఫౌండేషన్ ద్వారా మహిళలకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. తొందరలోనే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. యువత జంక్‌ఫుడ్‌కు అలవాటుపడ్డొదని ఇంటి ఆహారంతోనే ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు.
ఇటీవల ప్రేమ వివాహాలు ఎక్కువ అవుతున్నాయని, అబ్బాయిల ఆకర్షణలో పడి కనిపెంచిన తల్లిదండ్రులను వదిలి ఎంతో మంది బాలికలు జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. తల్లిదండ్రులను ఒప్పించి ప్రేమ వివాహాలు చేసుకోవాలని సూచించారు. అంతర్జాతీ య మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు శు భాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఇంది రా ప్రియదర్శిని సంస్థ నిర్వాహకురా లు గోవర్ధిని, బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి, బీజేపీ నాయకురాలు బాలత్రిపుర సుందరి, మహిళా కౌన్సిలర్లు జ్యోతి, లత, మహిళా వైద్యులు, మైనార్టీ విద్యార్థినులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో..
వనపర్తి టౌన్, మార్చి 8 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి స్వగృహంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు నాగమ్మ , కౌన్సిలర్ కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ కౌన్సిలర్ శారద మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన మహిళా కౌన్సిలర్లు స్వయంగా మున్సిపల్ యాక్ట్‌ను అవగాహన చేసుకొని ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, ఎన్నికైన వార్డు ప్రజల బీఆర్ఎస్ ప్రతిష్ట పెంచాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఏర్వ అరుణ, శిరీషారమేశ్గౌడ్, స్వాతి హరిబాబు, శంకరమ్మ బాబునాయక్, శ్రీకర్‌గౌడ్, మాజీ కౌన్సిలర్లు నం దిమల్ల శారద, ఉంగ్లం తిరుమల్ అలేఖ్య, డేగ శ్రీలత, జములమ్మ, కవితా నాయక్, సరస్వతి, స్వాతి, లలితమ్మ, నాయకులు అశోక్, గంధం పరంజ్యోతి, వెంకట్‌సాగర్, జోహెబ్హుస్సేన్, చిట్యాల రాము, హరిబాబు, స్టార్ రహీం, హర్షద్, తోట శ్రీను, తదితరులు ఉన్నారు.