RCB vs SRH : ఆర్సీబీ యువకెరటం దేవ్‌దత్ పడిక్కల్ (61) ఐపీఎల్ ఆరంభ పోరులో కుమ్మేశాడు. జాకబ్ డఫ్ఫీ స్థానంలో ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన పడిక్కల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఫిలిప్ సాల్ట్(8)ను ఔట్ చేసి సంబురాల్లో మునిగిన హైదరాబాద్ జట్టును హడలెత్తిస్తూ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు.
పడిక్కల్ మెరుపులతో ఆర్సీబీ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా బౌలర్ ఎవరైనా సరే బంతి గమ్యం బౌండరీయే అన్నట్టుగా విధ్వంసం కొనసాగించాడీ లెఫ్ట్ హ్యాండర్. హర్షల్ పటేలో ఓవర్లో ఫోర్‌తో 21 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న పడిక్కల్‌ను ఎట్టకేలకు హర్ష్ దూబే ఔట్ చేశాడు. కానీ, అప్పటికే చేయాల్సినంత నష్టమంతా చేసేన ఈ స్టార్ బ్యాటర్ ఆర్సీబీ విజయానికి బాటలు వేశాడు. అప్పటికీ ఆర్సీబీ స్కోర్.. 110-2
Pure class. Pure timing. Pure entertainment. 🤌
A spectacular 2️⃣1️⃣-ball 5️⃣0️⃣* from @devdpd07 ❤️
Updates ▶️ https://t.co/Eo5z0jh4K4 #TATAIPL | #KhelBindaas | #RCBvSRH | @RCBTweets pic.twitter.com/3H8rYfRZ08
— IndianPremierLeague (@IPL) March 28, 2026