ముంబై, జనవరి 29 : కెనరా బ్యాం క్ ఆశాజనక ఆర్థిక ఫలితా లు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.5,254 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది నమోదైన రూ.4,214 కోట్ల లాభంతో పోలిస్తే 25 శాతం వృద్ధి నమోదైంది.
బ్యాంక్‌కు వడ్డీల మీద వచ్చే ఆదాయం 1.13 శాతం అధికమై రూ.9,252 కోట్లకు చేరుకోగా, వడ్డీయేతర ఆదాయం 36 శాతం ఎగబాకి రూ.7,900 కోట్లకు చేరుకున్నది. గత త్రైమాసికంలో కొత్తగా రూ.1,857 కోట్ల రుణాలు మొండి బకాయిల జాబితాలోకి చేరాయని బ్యాంక్ వెల్లడిం చింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 2.35 శాతం నుంచి 2.08 శాతానికి దిగొచ్చాయి. అలాగే మొండి బకాయిలను పూడ్చుకోవడానికి రూ. 3,964 కోట్ల నిధులను వెచ్చించింది.