న్యూఢిల్లీ, నవంబర్ 2 : నిబంధనలు పాటించని రెండు ప్రముఖ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటక్షన్ అథారిటీ (సీసీపీఏ) రూ.8 లక్షల చొప్పున జరిమానా విధించింది. ప్రకటనల ద్వారా తప్పుదోవ, అన్యాయమైన వ్యాపార విధానాలు అవలంబించడమే కాక, వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఢిల్లీ కేంద్రంగా పనిచేసే దీక్షాంత్ ఐఏఎస్, అభిమాను ఐఏఎస్ కోచింగ్ సెంటర్లకు జరిమానా విధించినట్టు సీసీపీఏ తెలిపింది.
యూపీఎస్సీ పరీక్షల్లో విజేతలైన అభ్యర్థుల పేర్లు, ఫొటోలు అనధికారికంగా తమ ప్రచారానికి వాడుకున్నందుకు ఈ జరిమానా విధించామని వివరించింది. మినీ శుక్లా, మరికొందరు అభ్యర్ధుల ఫిర్యాదు మేరకు ఈ సంస్థలపై ఈ చర్యలు తీసుకున్నట్టు సీసీపీఏ తెలిపింది.