అనుమతి లేకుండా యూపీఎస్సీ విజేతలపై ప్రచారం
నిబంధనలు పాటించని రెండు ప్రముఖ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటక్షన్ అథారిటీ (సీసీపీఏ) రూ.8 లక్షల చొప్పున జరిమానా విధించింది.
- రెండు ఐఏఎస్ కోచింగ్ సెంటర్లకు రూ.8 లక్షల చొప్పున జరిమానా
న్యూఢిల్లీ, నవంబర్ 2 : నిబంధనలు పాటించని రెండు ప్రముఖ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటక్షన్ అథారిటీ (సీసీపీఏ) రూ.8 లక్షల చొప్పున జరిమానా విధించింది. ప్రకటనల ద్వారా తప్పుదోవ, అన్యాయమైన వ్యాపార విధానాలు అవలంబించడమే కాక, వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఢిల్లీ కేంద్రంగా పనిచేసే దీక్షాంత్ ఐఏఎస్, అభిమాను ఐఏఎస్ కోచింగ్ సెంటర్లకు జరిమానా విధించినట్టు సీసీపీఏ తెలిపింది.
యూపీఎస్సీ పరీక్షల్లో విజేతలైన అభ్యర్థుల పేర్లు, ఫొటోలు అనధికారికంగా తమ ప్రచారానికి వాడుకున్నందుకు ఈ జరిమానా విధించామని వివరించింది. మినీ శుక్లా, మరికొందరు అభ్యర్ధుల ఫిర్యాదు మేరకు ఈ సంస్థలపై ఈ చర్యలు తీసుకున్నట్టు సీసీపీఏ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

