ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ను రూ.13 వేల కోట్లకు మోసం చేసి విదేశాలకు పరారైన కేసులో వాణిజ్యవేత్త నీరవ్ మోదీ బావమరిది మయాంక్ మెహతా అప్రూవర్‌గా మారాడు. దీంతో సీబీఐ ప్రత్యేక కోర్టు అతడికి క్షమాభిక్ష ప్రసాదించింది.
ఈ కేసుకు సంబంధించి ప్రతి విషయం, కుంభకోణానికి దారి తీసిన విధానం, దానికి సంబంధించిన విషయాలు, ప్రమేయం ఉన్న వ్యక్తుల నిజ వివరాలు పూర్తిగా, నిజాయితీగా వెల్లడిస్తానని మెహతా క్షమాపణ దరఖాస్తును దాఖలు చేశారు.