న్యూఢిల్లీ: చంద్రునిపై అత్యంత విలువైన లోహాలు ఉండే అవకాశం ఉంది. స్వతంత్ర ఖగోళ శాస్త్రవేత్త జయంత్ చెన్నమంగళం నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దీనిపై ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. దీని ప్రకారం, చంద్రునిపై గల దాదాపు 6,500 గుంతల్లో ప్లాటినం, పల్లాడియం, రోడియం వంటి లోహాలు ఉండవచ్చు.
మరో 3,400 గుంతల్లో హైడ్రేటెడ్ మినరల్స్‌లో నీరు ఉండే అవకాశం ఉంది. చంద్రునిపై భవిష్యత్తులో జరిగే పరిశోధనలు వీటిపై దృష్టి సారించవచ్చు. భవిష్యత్తులో వనరుల తవ్వకాల కోసం చంద్రుడే ముఖ్యమైన గమ్యస్థానం కావచ్చు.