శ్రీనగర్: ఉగ్రవాదులు కశ్మీర్ లోయలోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వెంబడి వేచి చూస్తున్నారని బీఎస్ఎఫ్ ఐజీ అశోక్ యాదవ్ శనివారం చెప్పారు. ఉగ్రవాదుల ప్రయత్నాలను విఫలం చేయడానికి భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
శీతాకాలం ప్రారంభంలో ఇటువంటి ప్రయత్నాలు చేయడం సాధారణ విషయమేనని, నవంబర్ వరకు చొరబాట్లకు అవకాశం ఉంటుందని, ఆ తర్వాత ఆరు నెలల పాటు అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పారు. భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నందువల్ల ఉగ్రవాదులు చొరబడటం చాలా కష్టమని చెప్పారు.