Bulldozer Action : దేశ రాజధానిలోని ఓ కోచింగ్ సెంటర్లో దుర్ఘటన పెను దుమారం రేపింది. ఈ ఘటనలో కాబోయే సివిల్ సర్వెంట్స్ ప్రాణాలు గాలిలో కలిసిన రెండు రోజులకు అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఈ ప్రాంతంలో ఆక్రమణలను తొలగించి నీరు సాఫీగా సాగేందుకు అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో తొలగిస్తున్నారు.
డ్రైయిన్లకు అడ్డుగా నిర్మించిన బ్లాక్స్‌ను పొక్లెయిన్లతో సిబ్బంది తొలగిస్తున్నారు. ఇక ఢిల్లీ (Delhi)లోని ఓల్డ్ రాజేందర్ నగర్ (Old Rajinder Nagar)లో ఓ కోచింగ్ సెంటర్లోకి (Coaching Centres) వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో (Coaching Centre) శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై ఉవ్వెత్తున నిరసన వ్యక్తమవుతోంది.
ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంలూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇక ఈ ఘటన దురదృష్టకరమని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ చెప్పారు. ఇది దురదృష్టకర ఘటన, పలు కోచింగ్ సెంటర్లు లైబ్రరీల్లో నడుపుతూ బేస్మెంట్లో చట్టవిరుద్ధంగా క్లాస్‌లు చెబుతున్నారని అన్నారు. ఈ ఉదంతంలో ప్రమేయమున్న అధికారులపై చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.
Read More :