భోపాల్ : గిరిజన కార్మికుడిపై మూత్రం పోసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ప్రవేశ్ శుక్లాగా గుర్తించిన మధ్యప్రదేశ్ అధికారులు అతడిపై కఠిన చర్యలు చేపడుతున్నారు. శుక్లాకు చెందిన ఆస్తులను అధికారులు బుల్డోజర్తో (Bulldozer Action) నేలమట్టం చేశారు. గిరిజన కూలీపై మూత్రం పోసిన వీడియో వైరల్ కావడంతో బుధవారం ఉదయం నిందితుడిని అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. బుధవారం శుక్లా ఇంటికి చేరుకున్న అధికారులు దాన్ని అక్రమ కట్టడంగా పేర్కొంటూ ధ్వంసం చేశారు.
#WATCH | Sidhi viral video | Accused Pravesh Shukla’s illegal encroachment being bulldozed by the Administration. He was arrested last night.#MadhyaPradesh pic.twitter.com/kBMUuLtrjK
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 5, 2023
ప్రవేశ్ శుక్లా మూత్రం పోసిన గిరిజన కూలీని పేల్ కోల్గా గుర్తించగా ఈ వీడియోపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వైరల్ వీడియోపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందిస్తూ నిందితుడిని ఉపేక్షించేది లేదని, అతడిపై కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
నిందితుడు అమానవీయ చర్యకు పాల్పడ్డాడని, కఠిన శిక్ష కూడా అతడికి తక్కువేనని అతడికి విధించే శిక్ష ప్రతిఒక్కరికీ గుణపాఠంలా ఉండాలని, అతడిని విడిచిపెట్టేది లేదని తాను అధికారులకు ఆదేశాలు జారీ చేశానని సీఎం పేర్కొన్నారు. గిరిజన కూలీని అవమానించిన నిందితుడి చర్య అత్యంత హేయమని, మానవత్వానికి మాయని మచ్చని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా అన్నారు.
Read More :