పెబ్బేరు : వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో బీఎస్ఆర్ మెమోరియల్ ట్రస్ట్ ( BSR Memorial Trusts) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy) ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణలో స్వచ్ఛమైన తాగునీరు కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఈ మినరల్ వాటర్ ప్లాంట్ గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

బీఎస్ఆర్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు భువనేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఉచితంగా నాణ్యమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ట్రస్ట్ కృషి చేస్తుందని చెప్పారు. గ్రామ ప్రజలు ట్రస్ట్ సేవలను అభినందిస్తూ, ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడే ఈ కార్యక్రమం గ్రామానికి ఎంతో మేలు చేస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.