Vanda Devullu trialer | తెలుగు, తమిళంలో సూపనర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు విజయ్ ఆంటోని. ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ బిచ్చగాడు డైరెక్టర్ శశి డైరెక్షన్లో నటిస్తోన్న చిత్రం ‘వంద దేవుళ్లు’. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ఈ లోకంలో ప్రాణాలతో పుట్టిన అందరికీ కనీస అవసరాలుంటాయి. తినడం, నిద్రపోవడం, తోడు వెతుక్కోవడం అనే డైలాగ్‌తో షురూ అయింది ట్రైలర్. తర్వాత హీరోహీరోయిన్ల ప్రేమ సన్నివేశాలు, భార్యా భర్తల అనుబంధం, తల్లీ కొడుకుల అనుబంధం.. ఇలా ఫ్యామిలీ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే అన్ని ఎలిమెంట్స్‌తో సినిమాను తీసినట్టు ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. విజయ్ ఆంటోనీ సినిమాలంటే బలమైన సామాజిక సందేశం ఉంటుందని తెలిసిందే. ఈ సారి కూడా బాక్సాఫీస్ వద్ద తన సినిమాతో అందరినీ ఇంప్రెస్ చేయడం పక్కా అని ట్రైలర్ హింట్ ఇచ్చేస్తుంది.
రైతు సమస్యల చుట్టూ తిరిగే కథాంశంతో రాబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెబుతున్నాయి. ఈ మూవీలో స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని జూన్ 19న విడుదల చేస్తున్నారు.
Nithya Raman: లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో దూసుకెళ్తున్న నిత్యా రామన్
Flight crash | ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై పేలిన విమానం.. ఇద్దరు పైలట్లు మృతి..!
Bansuwada | విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలి.. బడిబాటలో ఉపాధ్యాయులు