BRSV | విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్ చేశారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికై ఇవాళ బీఆర్ఎస్వీ నాయకులు అసెంబ్లీని ముట్టడించారు. దీన్ని అడ్డుకున్న పోలీసులు.. వారిని నాంపల్లి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్, తుంగ బాలు మాట్లాడుతూ.. ఉద్యమాలను అణిచివేయాలని చూడటం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదని అన్నారు. ఇది రాజ్యాంగ హక్కులను హరించడమే అని స్పష్టం చేశారు. ఇవాళ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మండిపడ్డారు. గురుకులాలను పట్టించుకోవడం లేదని.. ప్రభుత్వ బడులను గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూనివర్సిటీల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలన్న సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదని వారు విమర్శించారు. నిరుద్యోగుల, విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించాలని సూచించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
విద్యా రంగంపై రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపు ధోరణికి వ్యతిరేకంగా అసెంబ్లీని ముట్టడించిన బీఆర్ఎస్వీ
నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్వీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు pic.twitter.com/jIW28WslB7
— Telugu Scribe (@TeluguScribe) March 24, 2026
అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ నాయకులు ఇవాళ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఎదుట ధర్నా చేపట్టారు. ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. విద్యారంగంపై సర్కార్‌కు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా గోస పుచ్చుకుంటుందని కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, అసెంబ్లీ ఎదుట ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్వీ నేతలను పంజాగుట్ట, నాంపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు. విడతల వారీగా బీఆర్ఎస్వీ నాయకులు అసెంబ్లీ ముట్టడికి వస్తుండటంతో వారిని అడ్డుకోవడానికి పోలీసులకు ముచ్చెమటలు పడుతున్నాయి