Pallichattambi | మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ (Tovino Thomas) ప్రధాన పాత్రలో నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘పల్లిచట్టంబి’ (Pallichattambi) కి సంబంధించిన తెలుగు టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. వరల్డ్ వైడ్ ఫిలిమ్స్ (World Wide Films) ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక టీజర్ చూస్తుంటే.. చారిత్రక నేపథ్యంలో సాగే సినిమా అని తెలుస్తుంది. ఇందులో టొవినో థామస్ ఒక మాస్ మరియు పవర్ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. 19వ శతాబ్దపు కేరళ సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారని అర్థమవుతోంది. ‘క్వీన్’, ‘జన గణ మన’ వంటి సెన్సేషనల్ హిట్స్ అందించిన డిజో జోస్ ఆంటోనీ (Dijo Jose Antony) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా. కయాడ్లోహార్ కథానాయికగా నటిస్తుంది. ‘పల్లిచట్టంబి’ అంటే ఆ కాలంలో ఒక ప్రాంతానికి రక్షకుడిగా ఉన్న వ్యక్తి అని అర్థం. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.