Dhurandhar 2 | భారతీయ బాక్సాఫీస్ వద్ద ధురంధర్ 2 రికార్డుల వేట కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజా ట్రేడ్ విశ్లేషణల ప్రకారం ఈ సినిమా మరో రికార్డును అందుకుంది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ మరియు ఫ్రాంచైజీ విలువ పరంగా ఈ చిత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ రికార్డులను అధిగమించి, భారతదేశంలోనే 3వ అతిపెద్ద ఫ్రాంచైజీగా అవతరించింది. పుష్ప ఫ్రాంచైజీలో వచ్చిన రెండు చిత్రాలు ఇప్పటివరకు రూ.2000 కోట్ల వసూళ్లను రాబట్టగా.. తాజాగా ఈ రికార్డును ధురంధర్ ఫ్రాంచైజీ రూ.2100 కోట్లతో అధిగమించింది.
ప్రస్తుతం ధురంధర్ జోరు చూస్తుంటే, రెండవ స్థానంలో ఉన్న బాహుబలి(రూ.2400 కోట్లు)తో పాటు, మొదటిస్థానంలో ఉన్న బాలీవుడ్‌కు చెందిన ప్రతిష్టాత్మక ‘వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్’ (YRF Spy Universe) స్థానాన్ని కూడా ఇది త్వరలోనే రీప్లేస్ చేసేలా కనిపిస్తోందని సినీ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే YRF రూ.3195 కోట్లతో ఎవరికి అందనంతా ఎత్తులో ఉంది. దీనిని ధురంధర్ అధిగమిస్తుందా లేదా అనేది చూడాలి.

Dhurandhar Movie