విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ విద్యార్ధి విభాగం కరీంనగర్ నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్
BRSV KARIMNAGAR | కమాన్ చౌరస్తా, మార్చి 29 : శాతవాహన యూనివర్సిటీకి మంజూరైన ఇంజిగ్ కళాశాలను యూనివర్సిటీ క్యాంపస్ లోనే ఏర్పాటు చేయాలని, హుస్నాబాద్ కు ఇంజిగ్ కళాశాల తరలించాడన్ని ప్రభుత్వం విరమించుకోవాలని బీర్ఎస్వి కరీంనగర్ నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందనీ, కానీ ఈ కళాశాలను యూనివర్సిటీ కేంద్రంగా కాకుండా హుస్నాబాద్‌లో నెలకొల్పడం సరైన నిర్ణయం కాదని ఆయన పేర్కొన్నారు.
జిల్లాలో ప్రస్తుతమున్న ఇంజినీరింగ్ కళాశాలలన్నీ ప్రైవేట్ యాజమాన్యంలోనే నడుస్తున్నాయనీ, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేయాలని విద్యార్థి సంఘాలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేయడం వల్ల ఈ కళాశాల మంజూరైనట్లు పేర్కొన్నారు. అయితే ఈ కళాశాలను యూనివర్సిటీలో కాకుండా హుస్నాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం సరైంది కాదని, వెంటనే ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం హుస్నాబాద్ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శాతవాహన యూనివర్సిటీలోనే ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను నెలకొల్పితే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని, జిల్లా కేంద్రంలో కళాశాల ఉంటే విద్యార్థులకు వసతి సౌకర్యం దొరకడం సులువవుతుందని, హుస్నాబాద్‌లో కళాశాల ఏర్పాటు చేస్తే అక్కడ సీటు పొందే విద్యార్థులకు వసతి, రవాణా తదితర సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు. యూనివర్సిటీ 200 ఎకరాల స్థలంలో ఉన్నదని, విద్యార్థులకు హాస్టల్ వసతి ఏర్పాటు చేసే వీలుంటుందని, కావున క్యాంపస్ లోనే కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉమ్మడి జిల్లాకు చెందిన శాసనసభ్యులంతా ఈ విషయంపై పునరాలోచించి విద్యార్థులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేకుంటే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళన చేసి మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ను అడ్డుకుంటామణి తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు సముద్రల ఓంకార్, సయ్యద్ షోహైల్, మడిశెట్టి అజయ కుమార్, నాయిని అన్వేష్, మామిడిపల్లి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.