KTR | మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ( మనూ ) విద్యార్థులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నందినగర్ నివాసానికి వచ్చిన విద్యార్థులకు కేటీఆర్ ఆత్మీయంగా స్వాగతం పలికారు.
కాంగ్రెస్ సర్కార్ మొన్న కంచె గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని చెరపట్టినట్టే గచ్చిబౌలిలోని మనూ (మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ) భూముల్ని సైతం కొల్లగొట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం ఉద్రిక్తతలకు తావిస్తున్నది. భూముల విషయమై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ యూనివర్సిటీ వీసీకి షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో వెలుగు చూసిన ఘటనపై ఇటు ప్రతిపక్షాలు, అటు విద్యార్థి లోకం భగ్గుమంటున్నది. సర్కారు తీరును నిరసిస్తూ బుధవారం మనూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం కాజేయాలని చూస్తే ఉద్యమిస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీలో వసతి గృహాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వందలాది మంది నిరుపేద విద్యార్థులు యూనివర్సిటీలో వసతులు లేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు అత్యవసరమైన హాస్టళ్లను యూనివర్సిటీలోని 50 ఎకరాల్లో నిర్మించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఈ అంశంపై కేటీఆర్‌తో మనూ విద్యార్థులు చర్చి్స్తున్నారు.
బంజారాహిల్స్‌లోని నందినగర్ నివాసంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమైన కేటీఆర్
50 ఎకరాల ఉర్దూ యూనివర్సిటీ భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని నోటీసులు ఇవ్వడం పైన కేటీఆర్‌తో చర్చిస్తున్న విద్యార్థులు https://t.co/Bz0E7dexBX pic.twitter.com/bR8wTyD5A2
— Telugu Scribe (@TeluguScribe) January 9, 2026