KTR | ప్రజాసమస్యలు పక్కన పెట్టి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఆటలా?.. కేటీఆర్ ఆగ్రహం
KTR | రాష్ట్రంలో అనేక ప్రజాసమస్యలను పక్కనబెట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం విడ్డూరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
KTR | హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అనేక ప్రజాసమస్యలను పక్కనబెట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం విడ్డూరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఒకవైపు సభలో పద్దులపై చర్చ జరుగుతున్నదని, ఆ చర్చను పక్కనబెట్టి ఆటలాడించాలని ప్రభుత్వం భావించడం భావ్యం కాదని, సమావేశాల నిర్వహణపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. దీనిపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వద్ద సరైన సమాధానం లేదని దయ్యబట్టారు. అనేక అంశాలపై సభలో చర్చించాల్సి ఉన్నదని, ఇరిగేషన్ వంటి పద్దులపై లోతుగా చర్చ జరుగాల్సి ఉన్నదని తెలిపారు. కానీ, సభలో ఆయా పద్దులపై నిర్మాణాత్మకమైన చర్చ జరుగకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
తూతూమంత్రంగా సభను నడుపుతున్నదని అభ్యంతరం వ్యక్తంచేశారు. మంత్రులే చర్చల్లో ఉండటం లేదని విమర్శించారు. ఈనెల 28, 29 తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటలపోటీలు పెడుతామని ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. అయితే సభలో తమ సమస్యలపై గొంతెత్తుతారని భావించిన ఎమ్మెల్యేలు మైదానాల్లో ఆటలాడుకుంటున్నారంటే ప్రజలు హర్షించబోరని పేర్కొన్నారు. కాలయాపన కోసమే ప్రభుత్వం ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్టు కనిపిస్తున్నదని తెలిపారు. సభలో అర్థవంతమైన చర్చను బీఆర్ఎస్ కోరుకుంటుందని, ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చేతకాక సభ నుంచి తప్పించుకోవడానికి సర్కార్ ఆటలపోటీలు పెడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress
- KTR
- Revanth Reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

