KTR | హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): మలయాళీలు స్వతహాగా కష్టపడేతత్వం కలిగినవారని, ప్రపంచంలోని ఏమూలకు వెళ్లినా కేరళవారు ఉంటారని భారత రాష్ట్ర సమితి వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు చెప్పా రు. అమెరికా వంటి దేశాల్లో కేరళ పారిశ్రామికవేత్తలను చూసినప్పుడు ఈ విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు. కేరళలో పెట్టుబడులను పెంచే కార్యక్రమాన్ని చేపట్టగలిగే శక్తి ప్రతి ఒక మలయాళీలోనూ ఉన్నదని ప్రశంసించారు. కొచ్చి నగరంలో గురువారం నిర్వహించిన టైకాన్ కేరళ అవార్డుల ప్రదానోత్సవంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కేరళలో పెట్టుబడులకు దోహదం చేయడంలో టైకాన్ కేరళ ప్రతినిధులు నిర్వాహకులుగా చేసిన కృషి అభినందనీయమని ప్రశంసించారు. ప్రతి అంశంలోనూ రాష్ట్రాల మధ్య పోలిక అవసరం లేదని పేరొన్నారు.
ఆయా రాష్ట్రాలకు తమ బలాలు, ప్రాధాన్యతలు ఉన్నాయని గుర్తించి వాటి ఆధారంగా ముందు కు సాగాలని అభిప్రాయపడ్డారు. పలు రా ష్ట్రాలు అనేక రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించాయని, వాటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా అన్ని రాష్ట్రాలు ప్రగతిబాటలో పయనించవచ్చని చెప్పారు. కేరళ సామాజిక, ఆర్థిక రంగాల్లో సాధించిన ప్రగతి ఆధారంగా అనేక అంశాలను నేర్చుకొనే అవకాశం ఉంటుందని తెలిపారు. వ్యక్తిగత హోదా లో, కేరళలో ఆంత్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ కోసం అవసరమైన మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాం టి సమావేశాలు జరిగితే తప్పకుండా పాల్గొంటానని చెప్పారు.