ఆత్మీయ సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ నాయకత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాలకు సమన్వయకర్తలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఆదివారం దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గస్థాయి ఆత్మీయ సన్నాహక సమావేశాలు జరిగాయి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి, పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో దుష్టపాలన కొనసాగుతున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. సీఎం కేసీఆర్‌తోనే పేదలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. సంక్షేమ పథకాలను గడప గడపకూ తీసుకువెళ్లాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు.
సిద్దిపేట, మార్చి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ నాయకత్వం కార్యాచరణను సిద్ధం చేస్తున్నది. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, జిల్లా అధ్యక్షులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులతో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో పార్టీ ఆత్మీయ సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలకు పార్టీ సమన్వయకర్తలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. జిల్లాకు పార్టీ జనరల్ సెక్రటరీ బోడకుంటి వెంకటేశ్వర్లు, మెదక్ జిల్లాకు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, సంగారెడ్డి జిల్లాకు ఎమ్మెల్సీ వెంకట్రామ్‌రెడ్డిని నియమించారు. వీరు ఆయా జిల్లాలో పార్టీ కార్యక్రమాలను స్థానిక శాసనసభ్యులు, ఇతర పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహిస్తారు. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టిసారించారు.
పది గ్రామాలను ఒక యూనిట్‌గా చేసుకొని ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చిన్న మండలాలు అయితే ఒకే సమావేశం నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులు కలిసి ఆత్మీయ సమావేశాలకు సిద్ధం చేశారు. ఏ మండలంలో ఏ రోజు నిర్వహించాలి..? ఏ గ్రామాలు కలిపి ఒక్క దగ్గర నిర్వహించాలి…? పట్టణంలో ఎలా నిర్వహించాలి..? తదితర అంశాలపై సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఆయా మండలాలు, పట్టణాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తారు. ఆయా జిల్లాల పార్టీ సమన్వయకర్తలు వీటిన సాఫీగా జరిగేలా చూస్తారు. 2023 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని మూడోసారీ భారీ మెజార్టీతో అధికారంలోకి తీసుకువచ్చే విధంగా పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఆత్మీయ సమా వేశాల నిర్వహణ బాధ్యత ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షులు, పార్టీ ఇన్చార్జిలు సమన్వయం చేసుకుం టూ నిర్వహిస్తారు. సమావేశాలకు పార్టీలోని అం దరిని కలుపుకొని ముందుకు సాగాలి. ఏప్రిల్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి మూడు జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాల్లో ఆత్మీయ సమావేశాలను పూర్తిచేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పార్టీ సమన్వయకర్తలను ఆదేశించారు. ముం దస్తుగానే ఏ మండలంలో నిర్వహిస్తారో పార్టీ కార్యకర్తలు తెలియజేస్తారు.
ఆత్మీయ సమా వేశాలు పూర్తిగా శిక్షణ తరగతుల మాదిరిగానే నిర్వహిస్తారు. కార్యకర్తలకు భోజన వసతిని ఏర్పాటు చేస్తారు. సమావేశాల్లో ఆ నియోజకవర్గం, మం డలం, గ్రామాలు, పట్టణాల్లో ఏం అభివృద్ధి చేశాం.. సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామనే విషయాన్ని పార్టీ కార్యకర్తలకు విడమరిచి వక్తలు చెబుతారు. సమావేశంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్యాడర్ తెలియజేస్తారు. ఎనిమిదిన్నర ఏండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధిని ప్రతి గడపకూ తీసుకుపోయేలా దిశానిర్దేశం చేస్తారు. ఏప్రిల్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం వరకు అన్ని మూడు జిల్లాలో ఆత్మీయ సమావేశాలను పూర్తి చేయాల్సి ఉం టుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని పార్టీ సూచించింది. జయంతి రోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 25న గ్రామాల్లో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరణ చేసిన అనంతరం నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సభ నిర్వహిస్తారు.
పార్టీ కార్యక్రమాలను విరివిగా చేపడుతూ ప్రజల్లో ఉండే విధంగా పార్టీ కార్యాచరణ సిద్ధం చేసింది. సీఎం కేసీఆర్ చేపట్టిన సం క్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నారు. 75 ఏండ్లలో జరగని అభివృద్ధి ఎనిమిదన్నరేండ్లలో ఎలా చేశామో పార్టీ క్యాడర్ ప్రజల్లోకి తీసుకుపోనున్నది. ప్రతి కార్యకర్తను పార్టీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న బీఆర్ఎస్ మంచి జోష్‌పై ఉంది. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలా క్యాడర్ సిద్ధం అవుతుంది. ఇందుకు కావాల్సిన కరపత్రాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల బుక్‌లను అందించనున్నారు. ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ తీసుకువచ్చిన నాడు నేడు బుక్‌లను కూడా పార్టీ క్యాడర్‌కు అం దించాలని మంత్రి కేటీఆర్ పార్టీ సమన్వయ కర్తలకు సూచించారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు పార్టీ నేతలు చేసుకుంటున్నారు.