Kodada : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన శుక్రవారం కోదాడ మున్సిపల్ కార్యాలయం అభ్యర్థులతో కిక్కిరిసిపోయింది. మున్సిపల్ ఎన్నికలకు 333 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుండి 152 మంది, భారతీయ జనతా పార్టీ నుండి 28 మంది, భారత రాష్ట్ర సమితి నుండి 73 మంది, తెలుగుదేశం పార్టీ నుండి నలుగురు, బహుజన సమాజ్ పార్టీ నుండి ఒకరు, కమ్యూనిస్టు పార్టీల నుండి నలుగురు, జనసేన పార్టీ నుండి ఏడుగురు, స్వతంత్ర అభ్యర్థుల 64 మంది నామినేషన్లు వేశారు.
నామినేషన్లకు శుక్రవారమే ఆఖరురోజు కావడంతో ఉదయం నుంచే మున్సిపల్ కార్యాలయం సందడిగా కనిపించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీగా తరలివచ్చి నామినేషన్లు వేశారు మున్సిపాలిటీలోని 35 వార్డుల్లోనూ బీఆర్ఎస్ కౌన్సిల్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. గడువు ముగిసే సమయానికి నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు అభ్యర్థులు పోటీ పడటంతో కార్యాలయ ఆవరణలో కోలాహలం నెలకొన్నది. ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారులు ఏర్పాట్లు చేయగా,అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.