బీఆర్ఎస్లో భారీగా చేరికలు
బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గులాబీ కండువాలు కప్పుకొంటున్నారు. ఆదివారం కూడా ఆయా జిల్లాల్లో భారీగా చేరారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, నవంబర్1: బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గులాబీ కండువాలు కప్పుకొంటున్నారు. ఆదివారం కూడా ఆయా జిల్లాల్లో భారీగా చేరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 100 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాగా హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో ఒంటిమామిడిపల్లికి చెందిన 50 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరగా, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలం నక్కలపెంట తండాకు చెందిన ఉప సర్పంచ్ అంగోతు మునియా, వార్డు సభ్యులు కేతావత్ హరియాతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. వీరికి అంగడిపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

