కారేపల్లి, అక్టోబర్ 4: ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందుకొచ్చారు. సింగరేణి మండలం మాదారం గ్రామానికి చెందిన మూడ్ లక్ష్మా దశదినకర్మల సందర్భంగా ఆదివారం పార్టీ గ్రామ, మండల కమిటీల ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యం అందజేశారు.
పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబానికి అవసరమైన సమయంలో చేయూత అందించాలనే ఉద్దేశంతో ఈ సహాయం చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. గ్రామంలో ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, అవసరమైన సందర్భాల్లో తమవంతు సహాయ సహకారాలు అందించడం సామాజిక బాధ్యతలో భాగమన్నారు. దశదినకర్మల నిర్వహణకు బియ్యం అందించడం ద్వారా కుటుంబానికి కొంతమేర అండగా నిలిచామని తెలిపారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, మనోధైర్యం కల్పించారు. పార్టీ నాయకులు సహాయం అందించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మాదారం గ్రామ శాఖ అధ్యక్షుడు కిలారి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ అజ్మీర రవి, 8వ వార్డు సభ్యుడు పాయం మునేందర్, బర్మావత్ కోటి, బర్మావత్ వీరన్న, బర్మావత్ వంశీ, రవి, మాజీ వార్డు సభ్యుడు లాలు, మోతిలాల్, రమేశ్, మురళి, బిక్కు, శ్రీకాంత్, దేవా, భాను తదితరులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.