KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో తన నివాసంలో సమావేశం కానున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సస్పెన్షన్ తర్వాత ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశం కీలకంగా మారింది. భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలతో కేటీఆర్ చర్చిస్తారు. నిన్నటి పరిణామాలపై ఎమ్మెల్యేలతో చర్చించి అసెంబ్లీలో బీఆర్ఎస్ పోరాటాన్ని బయటకు తీసుకెళ్లే వ్యూహం, సభలో సస్పెన్షన్, బయట పోరాటం, బీఆర్ఎస్ నెక్ట్స్ ప్లాన్, ప్రభుత్వంపై మరింత దూకుడుగా వెళ్లే అంశం, ప్రజా సమస్యలపై తదుపరి కార్యాచరణకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే రేపు తెలంగాణ భవన్ లో మాక్ అసెంబ్లీ నిర్వహించనున్నట్లు తెలిసింది.
కేటీఆర్ నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్
చేరుకున్న హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు
అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ తర్వాత తదుపరి కార్యాచరణపై ఎమ్మెల్యేలతో చర్చించనున్న కేటీఆర్, హరీష్ రావు
రేపు తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ నిర్వహించే యోచనలో బీఆర్ఎస్ నేతలు https://t.co/YqHKoALy6n pic.twitter.com/BNUax7Cmal
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026