BRS MLCs : తెలంగాణ శాసనసభ ఆవరణలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల కేసులో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల రిమాండ్‌కు నాంపల్లి కోర్టు నిరాకరించింది. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డిలను రిమాండ్‌కు తరలించాలన్న పోలీసుల ఓవరాక్షన్‌కు కోర్టు చెక్ పెట్టింది. వారి అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఎమ్మెల్సీలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. కాగా సభాధ్యక్షుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడ్డారని పోలీసులు ఆ ఇద్దరు ఎమ్మెల్సీలపై కేసులు నమోదు చేశారు.
అసెంబ్లీ పరిసరాల్లో జరిగిన ఘర్షణలకు సంబంధించి పోలీసులు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ అభ్యర్థనపై న్యాయస్థానం ఇరువర్గాల వాదనలు విన్నది. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించాలన్న పోలీసుల అభ్యర్థనను తోసిపుచ్చింది. అయితే నిందితులు ఇద్దరూ రూ.10 వేల చొప్పున వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.