BRS MLCs | పోలీసుల ఓవరాక్షన్‌కు చెక్ పెట్టిన కోర్టు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల రిమాండ్‌కు నిరాకరణ
BRS MLCs | తెలంగాణ శాసనసభ ఆవరణలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల కేసులో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల రిమాండ్‌కు నాంపల్లి కోర్టు నిరాకరించింది. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డిలను రిమాండ్‌కు తరలించాలన్న పోలీసుల ఓవరాక్షన్‌కు కోర్టు చెక్ పెట్టింది. వారి అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.
BRS MLCs : తెలంగాణ శాసనసభ ఆవరణలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల కేసులో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల రిమాండ్‌కు నాంపల్లి కోర్టు నిరాకరించింది. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డిలను రిమాండ్‌కు తరలించాలన్న పోలీసుల ఓవరాక్షన్‌కు కోర్టు చెక్ పెట్టింది. వారి అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఎమ్మెల్సీలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. కాగా సభాధ్యక్షుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడ్డారని పోలీసులు ఆ ఇద్దరు ఎమ్మెల్సీలపై కేసులు నమోదు చేశారు.
అసెంబ్లీ పరిసరాల్లో జరిగిన ఘర్షణలకు సంబంధించి పోలీసులు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ అభ్యర్థనపై న్యాయస్థానం ఇరువర్గాల వాదనలు విన్నది. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించాలన్న పోలీసుల అభ్యర్థనను తోసిపుచ్చింది. అయితే నిందితులు ఇద్దరూ రూ.10 వేల చొప్పున వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer | క్యాన్సర్‌ను నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Kishore Movie Makers | కిషోర్ మూవీ మేకర్స్ తొలి చిత్రం ప్రారంభం.. ముఖ్య అతిథులుగా వీవీ వినాయక్, ఆది సాయికుమార్
Dharman | అఫిషీయల్.. రజనీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల!
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

