తిరుమల : తిరుమల( Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు గురువారం దర్శించుకున్నారు. బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) , ఎమ్మెల్సీ రమణ ( Ramana ) తో పాటు నాయకులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి రంగనాయక మండపంలో తీర్థప్రసాదాలు అందజేసి, శాలువాలతో సన్మానించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 26 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 78,777 మంది భక్తులు దర్శించుకోగా 28,244 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించు కున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.35 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. 4.14 లక్షల లడ్డూలను విక్రయించామని, 2.02 లక్షల మందికి అన్నప్రసాదం అందించామని వివరించారు.