Tirumala | తిరుమలను దర్శించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు
Tirumala | తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు గురువారం దర్శించుకున్నారు.
తిరుమల : తిరుమల( Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు గురువారం దర్శించుకున్నారు. బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) , ఎమ్మెల్సీ రమణ ( Ramana ) తో పాటు నాయకులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి రంగనాయక మండపంలో తీర్థప్రసాదాలు అందజేసి, శాలువాలతో సన్మానించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 26 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 78,777 మంది భక్తులు దర్శించుకోగా 28,244 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించు కున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.35 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. 4.14 లక్షల లడ్డూలను విక్రయించామని, 2.02 లక్షల మందికి అన్నప్రసాదం అందించామని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rythu Bandhu | రైతుబంధు వరం.. తగ్గిన రుణభారం.. కేసీఆర్ పథకం.. తెచ్చిన ఫలితం
KCR | కేసీఆర్ తాత మంచిగున్నారా..కేటీఆర్‌ను అడిగిన చిన్నారి శ్రీయాన్సిక!
Revanth Reddy | రేవంత్ పాలనలో ఆదాయం డౌన్.. రూ.500 కోట్ల జీఎస్టీ వసూళ్లకు బ్రేక్
Muslim Voters | ఓటు కోల్పోతే దేశ బహిష్కరణ.. ముస్లింలలో పెరుగుతున్న పౌరసత్వ భయం!
Congress | ధోకాకు మూడేండ్లు.. నేటికీ నెరవేరని కాంగ్రెస్ మ్యానిఫెస్టో హామీలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

