Jobs | నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్ఐసీఎల్ కార్యాలయాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీని ద్వారా 321 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (AO) పోస్టులను నింపనుంది. ఆసక్తి, అర్హులు గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమయ్యింది. అక్టోబర్ 28 వరకు కొనసాగుతుంది.
పోస్టులు
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (Generalist and Specialists) స్కేల్-1
జనరలిస్ట్ ఖాళీలు- 200
స్పెషలిస్ట్ ఖాళీలు- 121
విభాగాల వారీగా స్పెషలిస్ట్ ఖాళీలు
ఫైనాన్స్ (CA & CMA)- 20
లీగల్- 20
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 11 (బ్యాక్లాగ్లతో కలిపి)
ఆటోమొబైల్ ఇంజినీర్స్- 20
రిస్క్ ఇంజినీర్స్- 28
కంపెనీ సెక్రటరీస్- 2
అగ్రికల్చర్- 20
అర్హతలు
జనరలిస్ట్ ఆఫీర్సర్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (PG) కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధిత విభాగాలను బట్టి సీఏ (ICAI) లేదా డిగ్రీ, పీజీలో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, పీజీ లా, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, అగ్రికల్చర్ పీజీ చదివి ఉండాలి.
వయసు
అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏండ్లలోపు ఉండాలి. ఓబీసీలకు 3, ఎస్సీ, ఎస్టీలకు 5, దివ్యాంగులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

Posts
ఎంపిక
ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ప్రిలిమ్స్ పరీక్ష 100 ప్రశ్నలు, 100 మార్కులకు ఉంటుంది. దీనిలో (ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30, రీజనింగ్ నుంచి 35, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 35 ప్రశ్నల చొప్పున ఇస్తారు. సమయం 60 నిమిషాలు. 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంది.
జనరలిస్ట్ ఏవో పోస్టులకు మెయిన్స్ పరీక్ష 250 ప్రశ్నలు 250 మార్కులకు ఉంటుంది. దీనిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 50, రీజనింగ్ నుంచి 50, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50, జనరల్ అవేర్నెస్ నుంచి 50, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 50 ప్రశ్నల చొప్పున ఇస్తారు. సమయం 180 నిమిషాలు. 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంది.
స్పెషలిస్ట్ ఏవో పోస్టులకు మెయిన్ పరీక్ష 250 ప్రశ్నలు, 250 మార్కులకు ఉంటుంది. దీనిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 40 ప్రశ్నల చొప్పున, సంబంధిత విభాగంలో టెక్నికల్/ప్రొఫెషనల్ పరిజ్ఞానాల నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. సమయం 180 నిమిషాలు. 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంది.
వీటితో పాటు 30 మార్కుల డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా రాయాలి. దీనిలో ఎస్సే 10, ప్రిసైస్ 10, కాంప్రహెన్షన్ 10 మార్కులు కేటాయించారు.
జీతం
ఎంపికైనవారికి నెలకు రూ. 82,485 నుంచి రూ. 1,56,745 వరకు ఉంటుంది.
ఫీజు
దరఖాస్తు ఫీజు రూ. 1000. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలకు రూ. 250.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు
తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలులో ఉన్నాయి.
చివరితేదీ
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. చివరితేదీ అక్టోబర్ 28. ఇతర వివరాలకు వెబ్సైట్ www.nationalinsurance.nic.co.inలో చూడండి.

Job