Telangana Assembly : మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలవగానే బీఆర్ఎస్ సభ్యులు ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Jagadish Reddy) సస్పెన్షన్ అంశాన్ని లేవనెత్తారు. జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని, ఈ అంశాన్ని స్పీకర్ పునఃపరిశీలించాలని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) విజ్ఞప్తి చేశారు. జగదీష్ రెడ్డి తమను ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడలేదని స్పీకర్‌తో అన్నారు.
స్పీకర్ అంటే తమకు గౌరవం ఉందని, జగదీష్ రెడ్డికి మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని హరీష్‌రావు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అంతకుముందు ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్‌కు బీఆర్ఎస్ శాసనసభాపక్షం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆయనను స్పీకర్ చాంబర్లో కలిసి వినతిపత్రం అదించింది. స్పీకర్ పట్ల జగదీష్ రెడ్డి అమర్యాదగా ప్రవర్తించలేదని, సస్పెన్షన్‌పై ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కానీ, బీఆర్ఎస్ పార్టీ వివరణ కానీ, జగదీష్ రెడ్డి వివరణ గానీ తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని తెలిపింది.
ఆ తరువాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. చర్చ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లును సీఎం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును ఖరారు చేశారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయినందున విభజన చట్టం ప్రకారం యూనివర్సిటీ పేరును మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.