రిమాండ్ రిజెక్ట్స్!
తెలంగాణలో ప్రజాకంఠక కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు.. న్యాయస్థానాలు ముకుతాడు వేస్తున్నాయి. అక్రమంగా పెట్టే కేసులకు జ్యుడీషియల్ రిమాండ్, పోలీసు కస్టడీలు ఉండబోవంటూ న్యాయమూర్తులు హితబోధ చేస్తూనే.. బాధితులకు బెయిల్ మంజూరు చేస్తున్నారు
-
సర్కార్ అత్యుత్సాహానికి చెంపపెట్టులాంటి తీర్పులు
-
బలంగా వాదనలు వినిపిస్తున్న బీఆర్ఎస్ లీగల్ టీమ్
-
ఎమ్మెల్సీలు తాతా మధు నుంచి దూదిమెట్ల వరకు..
-
ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు.. అరెస్టులు
-
చట్టపరిధిలో రిమాండ్లను రిజెక్ట్ చేస్తున్న కోర్టులు
ప్రతిపక్షం నుంచి ఒక్క ప్రశ్న వేస్తే చాలు.. వందల కేసులతో రంగంలోకి దిగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. పేరుకు ప్రజాపాలన అంటూనే.. ప్రశ్నిస్తే చాలు పోలీసులను ఉసిగొల్పుతున్నది. కేటీఆర్ నుంచి.. సామాన్య కార్యకర్తల వరకూ, ఆఖరికి సోషల్ మీడియాలో సైతం ప్రశ్నించే సామాన్యుల వరకూ అరెస్టులు చేయాలనే కుతూహలంతో కుయుక్తులు పన్నుతున్నది. ప్రజాక్షేత్రంలో ప్రశ్నకు సమాధానంతో ఎదుర్కొనే దమ్ములేక అడ్డగోలుగా కేసులు పెడుతూ జైలు పాలు చేసేందుకు కుట్రలకు దిగుతున్నది. కానీ, న్యాయస్థానాలు బాధితులకు అండగా నిలుస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తప్పుకాదని అక్రమంగా పెట్టే కేసుల్లో రిమాండ్లను తిరస్కరిస్తూ ప్రజాస్వామ్య విలువలకు నిలవుటద్దంగా తీర్పులిస్తున్నాయి.
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రజాకంఠక కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు.. న్యాయస్థానాలు ముకుతాడు వేస్తున్నాయి. అక్రమంగా పెట్టే కేసులకు జ్యుడీషియల్ రిమాండ్, పోలీసు కస్టడీలు ఉండబోవంటూ న్యాయమూర్తులు హితబోధ చేస్తూనే.. బాధితులకు బెయిల్ మంజూరు చేస్తున్నారు. ఒక్కోసారి ప్రభుత్వానికి చెంపపెట్టులాంటి తీర్పులు ఇస్తూ.. ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను న్యాయస్థానాలు కాపాడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ విధానాలు, పాలనాపరమైన నిర్ణయాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నది.
అంతేకాదు.. అర్ధరాత్రి వేళల్లో భయభ్రాంతులకు గురిచేసేలా అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, అధికార పార్టీ నేతలపై విమర్శలు చేసినా ప్రభుత్వ పెద్దలు పోలీసులను రంగంలోకి దించుతున్నారు. ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానాల ముందు హాజరుపర్చగా.. కొన్ని కీలక కేసుల్లో పోలీసులు కోరిన జ్యుడీషియల్ రిమాండ్‌ను న్యాయమూర్తులు తిరసరిస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో పోలీస్ కస్టడీ పిటిషన్లను కొట్టి వేస్తూనే ఉన్నారు. ఇంకొన్ని కేసుల్లో అరెస్టు చేయకుండా చట్టప్రకారం నోటీసులు ఇవ్వాలని ఆదేశిస్తున్నారు. అయినా, పోలీస్ వ్యవస్థలో, రాజకీయ నేతల్లో ఎలాంటి మార్పు రావడమే లేదని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తుతున్నారు.
ఒక్కొక్కరిపై నాలుగైదు కేసులు
ప్రశ్నిస్తున్న ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అరెస్టులను ఎదుర్కొంటున్న వారిలో బీఆర్ఎస్ నేతల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభా పక్ష ఉపనేత నేత హరీశ్‌రావు నుంచి సామాన్య కార్యకర్తల వరకూ కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు. ఈక్రమంలో ఒక్కొకరిపై నాలుగైదు కేసులను నమోదు చేశారు. మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్ వంటి వారిపై పదుల సంఖ్యలో అక్రమ కేసులు నమోదయ్యాయి. అయినా వారిని అరెస్టు చేసి, డైవర్షన్ పాలిటిక్స్ కోసం వాడుకున్నారే తప్ప..
వారిని జైలుకు పంపలేకపోయారు. ఎందుకంటే న్యాయబద్ధంగా చేస్తున్న వారి పోరాటాలకు న్యాయస్థానాలు, న్యాయమూర్తులు అండగా నిలుస్తున్నారు. పోలీసులు కోరే జ్యుడీషియల్ రిమాండ్లు, కస్టడీ పిటిషన్లను కొట్టివేస్తున్నారు. అలా న్యాయస్థానాలు, న్యాయమూర్తుల నుంచి రిలీఫ్ పొందిన వారిలో తాజాగా దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మన్నె క్రిశాంక్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, మహేశ్ ముదిరాజ్, మహేందర్‌రెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, నల్లబాలు, గౌతమ్, అశోక్‌రెడ్డి, నల్ల బాలు, ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి, జర్నలిస్టులు శంకర్, శివారెడ్డి తదితరులు ఉన్నారు. ప్రభుత్వ అక్రమ కేసులు, నిర్బంధాలు, అరెస్టులను ఎదుర్కొన్న వారిలో నమస్తే తెలంగాణ విలేకరి కొండా సతీశ్, జర్నలిస్టులు విజయారెడ్డి, రేవతి, తన్వీయాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, సుమిత్, రాజ్‌కుమార్, రంజిత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ప్రశ్నించే వారిని అణచివేసే కుట్ర
ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతుకలను అణచివేసేందుకు సర్కార్ పెద్దలు పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారనే వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏడేండ్లలోపు శిక్ష పడే నేరాల్లో అరెస్టు విషయంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) నిర్దేశించిన నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని న్యాయస్థానాలు స్పష్టం చేస్తున్నా.. పోలీసులు ఆ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.
బీఆర్ఎస్ లీగల్ టీమ్ సమర్థ వాదనలు
అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న కాంగ్రెస్ ప్రభు త్వం.. పాలనను పక్కనబెట్టి ప్రశ్నించే వారిపై కేసులు కట్టడం మొదలుపెట్టింది. వరసగా అరెస్టుల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు ఆదేశాలతో సమర్థవంతమైన లీగల్ టీమ్ ఏర్పాటైంది.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులను ఆ బృందం చట్టబద్ధంగానే ఎదుర్కొంటున్నది. అక్రమ కేసులు, అక్రమ రిమాండ్లు చట్టప్రకారం చెల్లవంటూ కోర్టుల్లో, న్యాయమూర్తుల ఎదుట బలంగా వాదనలు వినిపిస్తున్నది. ఒక వ్యక్తిపై కేసు నమోదైందని మాత్రమే అరెస్టు చేయడం, అరెస్టు చేశామని చెప్పి యాంత్రికంగా రిమాండ్ కోరడం సాధ్యంకాదని చట్టప్రకారం వివిధ సెక్షన్లతో సమాధానం ఇస్తున్నది. ముఖ్యంగా ఏడేండ్లలోపు శిక్షపడే నేరాల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీస్ జారీ చేయడం, అరెస్టు అవసరాన్ని చట్టబద్ధంగా సమర్థించడం కీలకమని, సుప్రీంకోర్టు అర్షేశ్కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో ఇచ్చిన మార్గదర్శకాలను వివరిస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

