ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు
రాష్ట్రంలో వచ్చిన కరువు ప్రకృతి తెచ్చింది కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలవల్ల ఏర్పడిన దుస్థితి అని మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక, సామాన్యులకు ఉపాధి కరువై, రైతులకు సాగునీరందక,
- మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
- రెండు ఎమ్మెల్సీలు గెలుస్తున్నాం
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
సంగెం/ కురవి, అక్టోబర్ 25 : రాష్ట్రంలో వచ్చిన కరువు ప్రకృతి తెచ్చింది కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలవల్ల ఏర్పడిన దుస్థితి అని మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక, సామాన్యులకు ఉపాధి కరువై, రైతులకు సాగునీరందక, ప్రజలకు తాగునీరు, విద్యుత్తు సరఫరా సక్రమంగా లేక అష్టకష్టాలు పడుతున్నారని విమర్శించారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఓటరు అవగాహన సదస్సులో, కురవి మండలం పెద్దతండాలో మీడియా సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడారు. వరంగల్-ఖమ్మ-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. తాను పట్టభద్రురాలిని కాకపోయినా.. తండాలో వందకుపైగా పట్టభద్రుల ఓట్లు నమోదు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో జరిగే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని సర్వేలు చెబుతున్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పరకాల నియోజకవర్గస్థాయి ఓటరు నమోదుపై అవగాహన సదస్సు ఆదివారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎర్రబెల్లి మాట్లాడుతూ.. 420 హామీలను మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా రాకేశ్‌రెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగు రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓటు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకే ఉందని చెప్పారు. కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి సాంబారి సమ్మారావు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

