కొరియా పెట్టుబడులకు అవకాశాలు : భట్టి
రాష్ట్ర పర్యాటక రంగంలోనూ కొరియా పెట్టుబడులకు విశేష అవకాశాలు ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ పర్యాటక విధానం 20252030 ద్వారా రూ.15,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, అదనంగా 3లక్షల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. 27 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు పేర్కొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ): రాష్ట్ర పర్యాటక రంగంలోనూ కొరియా పెట్టుబడులకు విశేష అవకాశాలు ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ పర్యాటక విధానం 20252030 ద్వారా రూ.15,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, అదనంగా 3లక్షల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. 27 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఆదివారం నిర్వహించిన కే హార్మనీ ఫెస్టాకొరియా కల్చర్ డే 2026 వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
కొరియా సంస్థల పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు, రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన, సాంకేతికత బదిలీ, యువత నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని తెలిపారు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, లైఫ్ సైన్సెస్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భాగస్వామ్యానికి అపార అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. రామప్ప ఆలయం, చార్మినార్, నాగార్జునసాగర్ బుద్ధవనం అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో కొరియా రాయబారి లీ సియుంగ్-హో, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

