నిరుపేదపేదలకు ఉచిత ప్లాస్టిక్ సర్జరీలు : బీఎస్ఎంఎస్
ప్రమాదవశాత్తు శరీరం కాలి తీవ్ర గాయాలపాలైన నిరుపేద బాధితులకు ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించనున్నట్టు బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ ట్రస్ట్ (బీఎస్ఎంఎస్) అదివారం ఒక ప్రకటనలో తెలిపింది. పెగాసిస్టమ్ సంస్థ ఆర్థిక సహకారంతో చేపట్టనున్న ఈ సేవా కార్యక్రమానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి ప్రారంభమై.. ఈ నెల 31 వరకు కొనసాగుతాయని తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ): ప్రమాదవశాత్తు శరీరం కాలి తీవ్ర గాయాలపాలైన నిరుపేద బాధితులకు ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించనున్నట్టు బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ ట్రస్ట్ (బీఎస్ఎంఎస్) అదివారం ఒక ప్రకటనలో తెలిపింది. పెగాసిస్టమ్ సంస్థ ఆర్థిక సహకారంతో చేపట్టనున్న ఈ సేవా కార్యక్రమానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి ప్రారంభమై.. ఈ నెల 31 వరకు కొనసాగుతాయని తెలిపారు. ఖరీదైన ప్లాస్టిక్ సర్జరీలను భరించలేక చికిత్సకు దూరంగా ఉంటున్న బాధితుల కోసం ముందుకొచ్చిన పెగాసిస్టమ్ సంస్థకు ట్రస్ట్ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ శస్త్రచికిత్సలను ప్రముఖ ప్లాస్టిక్ అండ్ కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అర్హులైన బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ల కోసం 7680974918ను సంప్రదించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

