హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌కు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ సీఎం హోదాలో ఈడీ ఆఫీసు ఎదుట ధర్నా చేసిన రేవంత్‌రెడ్డికి.. ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్‌కు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన నాయకులను అడ్డుకొనే హక్కు ఎక్కడిదని బీఆర్ఎస్ నేత కురువ విజయ్‌కుమార్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీసు వద్ద గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్యాలయం వద్ద శాంతియుతంగా వేచిచూస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యానికి దిగారని ఆరోపించారు.
పదేండ్లు మంత్రి హోదాలో హైదరాబాద్ ఖ్యాతిని పెంచిన కేటీఆర్‌పై కాంగ్రెస్ సర్కారు తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేయ డం దుర్మార్గమని సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌ డ్ మండిపడ్డారు. పనికిమాలిన కేసులతో కేటీఆర్ కీర్తిని చెరిపివేయలేరని ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. కక్షలు, కుట్రలను పక్కనబెట్టి పాలనపై దృష్టిపెట్టాలని హితవుపలికారు.
హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి మండిపడ్డారు. ఇది నూటికి నూరు శాతం కక్షసాధింపు చర్య అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తున్నందుకు ఏసీబీ, ఈడీ విచారణతో సీఎం రేవంత్‌రెడ్డి వేధిస్తున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు.