ప్రభుత్వం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి
ఎల్ నినో నుంచి బయటపడేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, కాపర్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టి నీటిని ఎత్తిపోయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి సూచించారు. జమ్మి చెట్టు విజయానికి చిహ్నమని, బతుకమ్మ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ ‘ఊరికో జమ్మి చెట్టు.. గుడిగుడికీ జమ్మి చెట్టు’లో భాగంగా తాటిపర్తి రాంచంద్రారెడ్డి, తాటిపర్తి సీకేరెడ్డి, ఆరావ్రెడ్డి, సర్పంచ్ పోనిశెట్టి మహేశ్, ఉపసర్పంచ్ లక్ష్మణ్‌తో కలిసి జమ్మి మొక నాటారు.
- బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి
జగిత్యాల, అక్టోబర్ 18 : ఎల్ నినో నుంచి బయటపడేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, కాపర్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టి నీటిని ఎత్తిపోయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి సూచించారు. జమ్మి చెట్టు విజయానికి చిహ్నమని, బతుకమ్మ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ ‘ఊరికో జమ్మి చెట్టు.. గుడిగుడికీ జమ్మి చెట్టు’లో భాగంగా తాటిపర్తి రాంచంద్రారెడ్డి, తాటిపర్తి సీకేరెడ్డి, ఆరావ్రెడ్డి, సర్పంచ్ పోనిశెట్టి మహేశ్, ఉపసర్పంచ్ లక్ష్మణ్‌తో కలిసి జమ్మి మొక నాటారు.
ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని చేపట్టిన హరితహారం స్ఫూర్తిగా మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన మొకలు నాటే కార్యక్రమం అభినందనీయమని కొనియాడారు. కేసీఆర్ దూరదృష్టితో దుర్భిక్ష పరిస్థితులను ఎదురొనేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని గుర్తుచేశారు. రాజకీయాలకు అతీతంగా పని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని చెప్పారు. నేటికీ ప్రాణహిత జలాలు 20 వేల క్యూసెకులు వృథాగా పోతున్నాయని, మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి వద్ద 93.5 మీటర్ల వద్ద నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని చెప్పారు. రూ.300 కోట్లతో కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టవచ్చని, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ వినియోగించుకోవచ్చని జలవనరుల శాఖ నివేదిక ఇచ్చిందని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

