బస్సుల నిర్వహణలో లోటుపాట్లు లేవు
పండుగల సమయంలో బస్సు టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక బస్సుల రద్దుకు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టంచేసింది.
- టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం వివరణ
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : పండుగల సమయంలో బస్సు టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక బస్సుల రద్దుకు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టంచేసింది. బస్సుల నిర్వహణలో లోటుపాట్లు లేవని పేర్కొన్నది. హరీశ్‌రావు సోషల్ మీడి యా వేదికగా చేసిన పలు వ్యాఖ్యలకు సంస్థ ఆదివారం స్పందించింది.
పండుగల సమయాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా టికెట్ ధరల నియంత్రణ, నిర్ణయాలు 2003వ సంవత్సరానికి చెందిన జీవో ఆధారంగా నిబంధనల ప్రకారం జరుగుతున్నాయని తెలిపింది. ‘మహాలక్ష్మి’ ఉచిత బ స్సు ప్రయాణ పథకం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నదని పేర్కొన్నది. దసరా పం డుగ వేళ ఈసారి ప్రత్యేకంగా 7,000 అదనపు బస్సులు ఏర్పా టు చేశామని, ఈ నెల 10 నుంచి ఇప్పటివరకు కేటాయించిన అదనపు బస్సుల్లో 97% సర్వీసులను విజయవంతంగా నడిపించి ప్రయాణి కులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చామని చెప్పింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

