‘ఎంవీఎస్ఆర్’ గుర్తింపు రద్దు చేయాలి: ఏఐఎస్ఎఫ్
రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ‘దాండియా సంగమం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో లైటింగ్ సిస్టం కూలి ఇద్దరు విద్యార్థులు మృతి చెందటం బాధాకరమని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ పేర్కొన్నారు. విద్యార్థుల మృతికి కారణమైన ఎంవీఎస్ఆర్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ‘దాండియా సంగమం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో లైటింగ్ సిస్టం కూలి ఇద్దరు విద్యార్థులు మృతి చెందటం బాధాకరమని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ పేర్కొన్నారు. విద్యార్థుల మృతికి కారణమైన ఎంవీఎస్ఆర్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కళాశాల యాజమాన్యం ఈవెంట్ను నిర్లక్ష్యంగా నిర్వహించడం వల్లే ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయి, పలువురికి గాయాలయ్యాయని ఆరోపించారు. ఎంవీఎస్ఆర్ కళాశాలలో నిర్వహించిన ఈవెంట్కు ఎలాంటి అనుమతి లేదని తెలిపారు. విద్యార్థుల మరణాలకు బాధ్యులుగా ఎంవీఎస్ఆర్ కళాశాల యాజమాన్యంపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఈవెంట్ల పేరుతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. భవిష్యత్తు ఇలాంటి ఈవెంట్ల నిర్వహణలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో నిబంధనలు పాటించేలా ఉన్నత విద్యాశాఖ, సీఎం రేవంత్రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

