వేములవాడ : మున్సిపల్ పరిధిలోని నాంపల్లి వార్డుకు చెందిన బీఆర్ఎస్ (BRS ) మాజీ గ్రామ అధ్యక్షులు, సీనియర్ కార్యకర్త వేములవాడ శ్రీనివాస్(47) గుండెపోటు ( Heart attack) తో మృతిచెందాడు. ఈ సందర్బంగా పార్టీ ఇన్చార్జి చల్మెడ నర్సింహారావు( Narasimha Rao) , జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పార్థివ దేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. శ్రీనివాస్ మృతి పార్టీకి తీరనిలోటు అని అన్నారు.
గుండెపోటుతో అకాల మరణం చెందడం బాధాకరమని పేర్కొన్నారు.
చల్మెడ శ్రీనివాస్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, మనోధైర్యం కోల్పోవద్దని కుటుంబ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, నాయకులు నీలం శేఖర్, వాసాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు నిమ్మ శెట్టి విజయ్, జోగిని శంకర్ తదితరులు పాల్గొన్నారు.