అలంపూర్, ఫిబ్రవరి 3 : తెలంగాణ ఏర్పడినప్పటి నాటి నుంచి జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోటగా మారింది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో అలంపూర్ 10వ వార్డు (ఎస్టీ రిజర్వ్) ఏకగీవ్రమైంది. బీఆర్ఎస్ అభ్యర్థి విక్రమ్ ఏకగ్రీవంగా ఎన్నికై పార్టీ నుంచి బోణీ కొట్టారు.
మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ పర్వం పూర్తవగా.. 10వ వార్డు నుంచి ఒక్క నామినేషన్ మిగులడంతో కౌన్సిలర్ ఎన్నిక ఏకగ్రీవమైన ట్టు అధికారులు ధ్రువీకరణపత్రం అం దజేశారు. ఈ పత్రంతో కౌన్సిలర్ విక్ర మ్.. ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, ఎమ్మె ల్యే విజయుడును మర్యాద పూర్వకంగా కలువగా అభినందించారు.