గజ్వేల్, జూలై 14: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచన విరమించుకుని వెంటనే గోదావరి జలాలను పంపుల ద్వారా ఎత్తిపోసి, ప్రాజెక్టులు నింపాలని, కరువులో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకుని అండగా నిలబడాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలం గాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బద్నాం చేయాలనే విషపూరితమై ఆలోచనతో రేవంత్‌రెడ్డి ఉన్నాడని, రాష్ట్ర ప్రజలు ప్రతీదీ ఆలోచిస్తున్నారని, రేవంత్‌రెడ్డి రాజకీయంగా బీఆర్ఎస్పై కొట్లాడాలే కాని రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోమన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి కొద్దికాలంలోనే రైతులకు సాగు, తాగునీళ్లు కేసీఆర్ అందించారన్నారు. వానకాలం సీజన్లో నీళ్లు ఇవ్వకుండా రైతులకు ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మోదీతో కుమ్మక్కై మేడిగడ్డను ఎండబెట్టాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం పంపులను ఆన్‌చేసి బ్యారేజీలు నింపాలని, హరీశ్‌రావు విసిరిన సవాల్‌కు స్పందించలేదని, తనకు అవకాశం కల్పిస్తే ప్రాజెక్టులను నింపి చూపిస్తానని హరీశ్‌రావు మాట్లాడితే ప్రభుత్వంలోని ఒక్కరూ కూడా మాట్లాడలేకపోతున్నారన్నారు. రేవంత్‌రెడ్డి ఏమీ మాట్లాడుతున్నడో ఆయనకే అర్థంకావడం లేదన్నారు. 17న కొండపోచమ్మ ప్రాజెక్టుపై రైతులతో కలిసి ధర్నా నిర్వహిస్తామని, పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. మల్లన్నసాగర్ నీటిని వదిలి కూడవెళ్లి, హల్దీ వాగుల్లోని చెక్‌డ్యామ్‌లు నింపాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మధు, నవాజ్, నూనె కుమార్, శ్రీనివాస్‌గౌడ్, నాయకులు పండరి రవీందర్రావు, పాండు, ప్రశాంత్, ఉపేందర్‌రెడ్డి, గొడుగు స్వామి, యాదవరెడ్డి, ఉమర్, ఎక్బాల్, సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.