Sarpanch Elections | మహబూబ్నగర్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు షాకిచ్చారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్వగ్రామం చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఘన విజయం సాధించారు.
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే ఉద్దేశ్యంతో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వర్గం విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచారు. వినని వాళ్లను బెదిరింపులు, భయబ్రాంతులకు గురిచేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ నాయకుల ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్న గ్రామస్తులు.. బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించారు. దీంతో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పావని కృష్ణయ్య శెట్టి 110 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత గ్రామంలో బీఆర్ఎస్ ఘన విజయం
మహబూబ్ నగర్ జిల్లాలో అదికార పార్టీకి షాక్ ఇచ్చిన ఓటర్లు
దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్వగ్రామం చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు
ఎమ్మెల్యే వర్గానికి షాక్ ఇస్తూ… pic.twitter.com/wiXre0bAJV
— Telugu Scribe (@TeluguScribe) December 14, 2025